ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. జడ్పీ నిధుల తరలింపుపై కాంగ్రెస్, తెరాస సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నిధుల మంజూరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు.
ఈ గొడవలో సభ్యుడు గణేశ్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ సస్పెండ్ చేశారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా సభ్యులు జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.