మద్యం దుకాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ... ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగమ(కే)లో మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామం వద్ద నాలుగు మద్యం దుకాణాలను నెలకొల్పిన సందర్భంగా... స్థానిక మహిళలు, యువత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. రాస్తారోకోతో గంటపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రోడ్లపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగిన మత్తులో కొందరు తమ ఇళ్ల వద్ద గొడవలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారని తెలిపారు. తక్షణమే మద్యం దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మహిళలకు నచ్చచెప్పగా... మహిళలు రాస్తారోకోలు విరమించుకున్నారు.
ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా