ETV Bharat / state

మహిళలు నడిపిస్తున్న ఈ థియేటర్‌ సూపర్ హిట్టు!

author img

By

Published : Mar 3, 2023, 2:01 PM IST

Balloon theater run by women groups: మహిళలు తలుచుకుంటే సాధించలేదని ఏమి ఉండదు. వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అలానే కొందరు మహిళలు కలసి వారి ఊరికి థియేటర్​ లేదని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సినిమా హాలుని నిర్మించుకున్నారు. ఇంతకీ దాని వలన వారికి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందంటే..!

Balloon theater run by womens groups
థియేటర్​ని నడుపుతున్న మహిళా సంఘాలు

Balloon theater run by women groups in asifabad: కొన్ని సంవత్సరాలుగా వారి ఊర్లో థియేటర్​ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి నచ్చిన మూవీను హాల్​లో చూడాలంటే దూర ప్రాంతాలకు వెళ్లవల్సి వచ్చేది. ఈ సమస్యను మహిళా సంఘాలు కలిసి కట్టుగా పోరాడి దూరం చేశాయి. చివరికి వారే ఒక సినిమా హాల్​ని నిర్మించుకున్నారు. మొదటి సంవత్సరమే వారు అనుకున్నంత సంపాదన రావడంతో ఆనందంగా ఉన్నారు. ఇదంతా అసిఫాబాద్​ జిల్లాలో జరిగింది.

కుమురంభీం జిల్లా వాసులు మూడు దశాబ్దాలుగా దూరమైన సినిమా కలను సాకారం చేశారు మహిళలు. పైసా పైసా కూడబెట్టిన పొదుపు డబ్బుతో, అధికారుల సహకారంతో, అత్యాధునిక థియేటర్​ను అన్ని తామై విజయవంతంగా నడిపిస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేనివిధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ బెలూన్ థియేటర్ నేడు లాభాల బాటలో దూసుకుపోతుంది. 2022 మార్చి 8న కుమురం భీం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బెలూన్ థియేటర్ అసిఫాబాద్​లో ప్రారంభమైంది.

పిక్చర్ ట్యూబ్ సంస్థ 50 శాతం 25 లక్షలు, మహిళ సంఘాలు 50 శాతం 25 లక్షలు పెట్టుబడి పెట్టారు. అధికారులు స్థలం సమకూర్చారు. 120 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ థియేటర్ హెచ్​డీ ప్రొడక్షన్​తో పాటు, 5.2 డాల్బీ డిజిటల్ సౌండ్, కుషన్ సీట్లు ఉన్నాయి. ప్రమాదాలను తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఆర్​ఆర్​ఆర్ సినిమా నడిచే సమయంలో దర్శకుడు రాజమౌళి థియేటర్​ను సందర్శించి మహిళల నిర్వహణను అభినందించారు.
టిక్కెట్లు ఇవ్వడం, ప్రొజెక్టర్ నడిపించడం, శాటిలైట్ సంకేతాల ద్వారా సినిమాను డౌన్​లోడ్ చేయడం, చిరు దుకాణాలను నిర్వహించడం అన్ని మహిళ సంఘాల సభ్యులే చేస్తున్నారు. సంవత్సర కాలంగా 10 లక్షల ఆదాయం వచ్చింది. వీటిని మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళ సంఘాలకు రుణాలుగా ఇస్తూ వారి ఉపాధికి చేయూత అందిస్తున్నారు.

మహిళలు నడిపిస్తున్న ఈ థియేటర్‌ సూపర్ హిట్టు

"గత 30 సంవత్సరాలుగా అసిఫాబాద్​లో సినిమా థియేటర్​ లేదు. సినిమా చూడాలంటే దూర ప్రాంతాలకి వెళ్లవల్సి వచ్చేది. ఈ సినిమా హాల్​ని ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ థియేటర్​కి దర్శకుడు రాజమౌళి సందర్శించారు. చాలా మంది అధికారులు కూడా వచ్చారు." - మహిళ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.