ETV Bharat / state

'నెలరోజుల పాటు మారు కాళ్లతోనే నడుస్తాం'

అడవితో మమేకమయ్యే... ఆదివాసీల జీవన విధానం అరణ్యం చుట్టే పరిభ్రమిస్తోంది. అనాదిగా పాటిస్తున్న సంస్కృతి... సంప్రదాయంగా కొనసాగిస్తూ నేటికీ వారు పాటిస్తున్న సనాతన విధానాలు ఆకట్టుకుంటున్నాయి. బాహ్యప్రపంచానికి దూరంగా కాలం వెల్లదీసే గిరిపుత్రుల బతుకు దెరువు... కాలానికి అనుగుణంగా ప్రకృతితో మమేకమవుతోంది. అందులో భాగమే కోడా వేడుక. ఆదిలాబాద్‌ మన్యంలో శ్రావణ మాసంలో నిర్వహించే ఆ వేడుకపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

author img

By

Published : Aug 20, 2019, 6:02 AM IST

'నెలరోజుల పాటు మారు కాళ్లతోనే నడుస్తాం'

గడప దాటి అడుగు పెడితే బండి.. ఊరు దాటి వెళ్లాలంటే కారు.. జిల్లా దాటాలంటే బస్సు.. రాష్ట్రం దాటి వెళ్లాలంటే రైలు.. విదేశాలకు వెళ్లాలంటే విమానం ఇలా ఒకటా రెండా ఎన్నో వసతులున్నాయి నేటి నగర వాసులకు. మరి రాళ్లనే దారిగా మార్చుకుని బురదలోనే ప్రయాణం సాగించే గిరి పుత్రులకు నడకే నరకప్రాయం. వెలుగులేని దారుల్లో.. కటిక చీకట్లో నడుచుకుంటూ ఏ పక్కనుంచి ఏదొచ్చి కాలికింద పడుతుందో తెలియకుండా నడక సాగించే గిరిజనుల కాళ్లకు కోడా రూపంలో ఓ జత దొరికింది.

నెలరోజుల పాటు జత కాళ్లు జతగా కలుస్తాయి

గోండి భాషలో కోడా అంటే తెలుగులో గుర్రం అని అర్థం. రెండు పొడుగాటి కర్రలను సమాంతరంగా నరికి.. వాటి మధ్యలో అడ్డంగా చిన్న కర్రను పెడతారు. వాటిపై నిల్చొని నడవడమే కోడా వేడుక ప్రత్యేకత. ఉమ్మడి ఆదిలాబాద్​లోని మన్యం ప్రాంతాల్లో ఏటా ఆషాడం అమావాస్య నుంచి శ్రావణ అమావాస్య వరకు ఈ వేడుకను నిర్వహిస్తారు. చిన్నపిల్లలున్న ఇంట్లో ఈ వేడుక చేయడం ఆనవాయితీ.

ఎలా వచ్చిందీ వేడుక

విద్యుత్​ సౌకర్యం లేని రోజుల్లో వర్షాకాలంలో గిరిజనుల ఇబ్బందులు వర్ణణాతీతం. దారులన్నీ బురదమయమై క్రిమికీటకాల భయం పొంచి ఉండేది. వాటి నుంచి తమ బిడ్డలను కాపాడుకునేందుకు శతాబ్దాల కిందటే తీసుకొచ్చిన సంప్రదాయ వేడుకే కోడా. ఇక్కడ పిల్లలు నెల రోజుల పాటు మారుకాళ్లతో నడుస్తారు. శ్రావణ అమావాస్య మరుసటి రోజు గ్రామశివార్లలో ఈ కర్రలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి అక్కడే వదిలేస్తారు. తర్వాత ఏడాది వరకు వీటి జోలికి వెళ్లకూడదనేది నియమం.

రక్షణతో కూడిన కట్టుబాటు

ప్రకృతితో మమేకమైన ఆదివాసీలు తమను తాము రక్షించుకోవటంలో అనుసరించిన విధానాలే... తరువాత కాలంలో ఆచారవ్యవహారాలుగా మారాయంటారు స్థానిక ఉపాధ్యాయులు. తమకంటే ఎత్తైన కర్రలపై పిల్లలు అవలీలగా నడవటమే కాదు.. నలుగురు కలిస్తే లయబద్ధకంగా నాట్యం చేస్తారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్​ ఆదివాసీ గూడేల్లోనే కనిపించే ఈ వేడుక ఆధునికులకు కాస్త భిన్నంగా కనిపించినా ఎంతో శాస్త్ర విజ్ఞానం దాగుంది.

'నెలరోజుల పాటు మారు కాళ్లతోనే నడుస్తాం'

ఇదీ చూడండి: ఆదిలా'బాధ'లు.. రహదారులతో ఇక్కట్లు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.