మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన తెలియజేశారు. అల్ప సంఖ్యాక వర్గానికి కోటాకు మించి మంత్రి పదవులు ఇస్తున్నారు. 12 శాతం ఉన్న మాదిగలకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి విమర్శించారు.
ఇవీ చూడండి: ఇది నా జీవితంలో నూతన అధ్యాయం: దత్తాత్రేయ