విజయ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పాల ఉత్పత్తుల వాహనాల సేవలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో ఛైర్మన్ లోక భూమారెడ్డి ప్రారంభించారు. అన్ని జిల్లాల కంటే ముందుగా ఆదిలాబాద్‌లో సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. తొలి విడతలో పది వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
నిరుద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే వాహనాలను యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమిందర్ పాల్గొన్నారు.