ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో విషాదం నెలకొంది. రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్‌తీగలు తెగి పడటం వల్ల విద్యుదాఘాతంతో రెండు కాడెడ్లు మృతి చెందాయి. ఎడ్లబండిపై ఉన్న అశోక్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కిందికి దూకటంతో స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని గ్రామస్థులు హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్థులు మండిపడ్డారు.
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలు