కలెక్టరేట్ ఎదుట వ్యాపారుల ధర్నా ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు. రైతుబజార్ ఏర్పడినప్పటి నుంచి అక్కడే విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇన్నాళ్లుగా ఉన్న తమను కాదని... కొత్తగా వచ్చినవారికి స్థలాలు కేటాయించడంపై భగ్గుమన్నారు. కొంతమంది దళారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.