ETV Bharat / state

Varalakshmi Vratam: మహాలక్ష్ముల వరలక్ష్మీ వ్రతాలు.. కిక్కిరిసిన ఆలయాలు

author img

By

Published : Aug 20, 2021, 2:14 PM IST

వేకువజామునే లేచి తలస్నానం చేసి... పట్టుచీరలు కట్టి, తలలో పూలు, కళ్ల నిండా కాటుక, పాదాలకు పసుపు పెట్టుకుని వరలక్ష్మీ వ్రతాలు చేసుకుంటున్నారు. పరస్పరం ముత్తయుదువులందరూ వాయునాలు అందించుకుంటున్నారు.

varalaxmi-vrathalu-in-adilabad-temples
మహాలక్ష్ముల వరలక్ష్మీ వ్రతాలు.. కిక్కిరుస్తున్న ఆలయాలు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శ్రావణ రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రసిద్ధ గోపాలకృష్ణ మఠం, శిశుమందిర్ పాఠశాలల ఆవరణలో మహిళలు వ్రతాలు చేశారు. వేకువజామునే నిద్ర లేచి అభ్యంగన స్నానాలు చేసి... అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేందుకు ముస్తాబయ్యారు.

ఉదయం నుంచి ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ముత్తయిదువలు... అమ్మవారికి ప్రత్యేక పూలు, పండ్లతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మధ్య ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. వినాయక, వరలక్ష్మీ పూజలు చేసి... పరస్పరం పసుపు, బొట్టు ఇచ్చుకున్నారు. నగరంలోని ఏ ఇంట్లో చూసినా.. ఏ గుడిలో చూసినా.. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. మహిళలు పట్టుచీరలు కట్టి, తలలో పూలు, కళ్ల నిండా కాటుక, పాదాలకు పసుపు పెట్టుకుని... వాయనాలు అందిస్తూ, అందుకుంటూ సందడి చేస్తున్నారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి: Varalakshmi Vratam: ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో మహిళల వ్రతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.