ETV Bharat / state

ఈనెల 28న ఆదిలాబాద్​కు అమిత్​షా రాకా.. నియోజకవర్గాల బలోపేతమే లక్ష్యంగా - అమిత్​షా టూర్​ ఇన్​ ఆదిలాబాద్​

Amit Shah tour in Adilabad: రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నియోజకవర్గాలలో బలోపేతంపై దృష్టిసారించిన కమలం పార్టీ ముందుగా ఆదిలాబాద్​ను ఎంచుకోంది. ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ.. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్​షా వచ్చి తొలిసభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

Amit Shah tour in Adilabad
Amit Shah tour in Adilabad
author img

By

Published : Jan 17, 2023, 6:12 PM IST

Amit Shah tour in Adilabad: ఈనెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌ జిల్లాకు రానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల బలోపేతంపై దృష్టిపెట్టిన బీజేపీ తొలిసభను ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించడంతో ఆపార్టీ శ్రేణులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కోర్‌ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లా ప్రభారీ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొనగా.. ఆయా జిల్లా అధ్యక్షులు పాయల్‌శంకర్‌, డా.శ్రీనివాస్‌, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌ తదితరులు హాజరై.. సభను ఎలా విజయవంతం చేయాలి అనే దానిపై విస్తృతంగా చర్చించారు.

"ఈనెల 28న కేంద్ర మంత్రి అమిత్​షా రావడం చాలా సంతోషం. మన గిరిజన జిల్లాలో ఆయన పర్యటించడం మన పార్టీకి ప్రజల్లో నుంచి మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నాం. సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులంతా కష్టపడాలి వారి సలహాలు సూచనలు ఇవ్వాలి".- సోయం బాపురావు, ఎంపీ ఆదిలాబాద్‌

ఈనెల 28న ఆదిలాబాద్​కు అమిత్​షా రాకా.. నియోజకవర్గాల బలోపేతమే లక్ష్యంగా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.