ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఐదు సహకార సంఘాలకు నామపత్రాల ఉపసంహరణ తర్వాత నాలుగు సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని మానకపూర్లో 9, నర్సాపూర్‌లో 10, జామిది మొక్రాలో 13 స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం.
ఇచ్చోడ సహకార సంఘానికి 13 స్థానాల్లో 5 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 31 మంది అభ్యర్థులు దాఖలు చేయగా... 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 10 మంది ఉపసంహరించుకున్నారు. ఐదుగురు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఇలా బోథ్ నియోజకవర్గంలోని బోథ్ నేరడిగొండ, గుడిహత్నూర్ బజార్హత్నూర్ మండలాల్లో సహకార సంఘాల ఎన్నికలు కొన్ని చోట్ల ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల పోటీ నెలకొంది.
ఇదీ చూడండి:చైనాలో ఫ్యాక్టరీలు కూత కూయట్లేదు