ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఫారెస్టు బీట్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి కాగా.. మరొకరు తలమడుగు మండలం కజ్జర్లకు చెందిన తలారి వెంకటేశ్గా గుర్తించారు. మరో ఇద్దరు గాయాలపాలవ్వగా.. వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి.. నేరడిగొండ మండలం కుంటాల బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. తమ శాఖలో పనిచేసే అధికారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: సచివాలయంలోకి సందర్శకులకు ప్రవేశం లేదు