ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి పర్యటించారు. రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం సఖి కేంద్రానికి వెళ్లి అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనుబంధశాఖల అధికారులతోనూ సమావేశమై జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించారు.
ఇదీ చదవండి: ధాన్యం కాంటాల కోసం.. రైతుల తంటాలు