పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ రాజేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాలకు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని నేతలు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్ ఫండింగ్