ETV Bharat / state

ఎడ్లబండిపై పెళ్లికూతురు.. కాలినడకన బంధువులు.. ఇది ఆచారం కాదండోయ్​..?

author img

By

Published : Apr 28, 2022, 5:11 AM IST

Updated : Apr 28, 2022, 6:21 AM IST

పెళ్లికి వెళ్లాలంటే బస్సుల్లోనే, ప్రత్యేక వాహనాల్లో లేక.. ఒకరిద్దరైతే ద్విచక్రవాహనాలపైనో వెళ్లడం చూస్తుంటాం. అదే పెళ్లి కూతురు, కుమారుడైతే ప్రత్యేకంగా అలంకరించిన కారులోనో.. జీపులోనో.. మండపానికి వెళ్తారు. కొందరు ఊరేగింపు కోసం గుర్రపు బండిని కూడా వాడతారు. ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా ఓ పెళ్లికూతురు ఎడ్లబండ్లపై, బంధువులు కాలినడకన.. పెళ్లివారింటికి వచ్చారు. ఇదేదో వాళ్ల ఆచారమో..? కొత్తగా ప్రయత్నించాలన్న వాళ్ల ఆలోచనో కాదు..? అవి వాళ్ల అగచాట్లు..!!

tribal marriage problems due to no road to bride grooms village

tribal-marriage-problems-due-to-no-road-to-bride-grooms-village

ఆదిలాబాద్‌ జిల్లా వానవట్‌ పంచాయతీలోని అనుబంధ గ్రామమైన మాంగ్లీకి చెందిన సెడ్మకీ సీతాబాయి కుమారుడు కోష్‌రావ్‌కు.. గుడిహత్నూర్‌ మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన యువతి గంగాదేవితో పెళ్లి నిశ్చయమైంది. ఈపెళ్లి ఘనంగా జరిగింది. వేడుక చూసేందుకు ఊరంతా కదిలివచ్చారు. అయితే.. పెళ్లి మండపానికి వచ్చేందుకు వధువు, వాళ్ల బంధువులు మాత్రం నాన తంటాలు పడ్డారు. చివరకు పెళ్లి కూతురును ఎడ్లబండి మీద, బంధువులు నడుస్తూ.. పెళ్లివారింటికి వచ్చారు.

అసలు విషయమేమిటంటే.. 30 ఆదివాసీ కుటుంబాలు, 100 మంది మేర నివసిస్తున్న మాంగ్లీ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. రు. పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ గ్రామం నుంచి వాన్‌వట్‌ వరకు టెంపో వాహనంపై వచ్చారు. ఇక అక్కడి నుంచి 4 కి.మీ. దూరంలో ఉన్న మాంగ్లీ గ్రామానికి వెళ్లేందుకు మాత్రం అపసోపాలు పడ్డారు. పట్టుచీర కట్టుకుని ముస్తాబైన పెళ్లికూతురును నడిపించొద్దన్న అభిమానంతో.. ఆమె కోసం పెళ్లికొడుకు తరఫు వారు ప్రత్యేకంగా ఎడ్లబండిని ఏర్పాటుచేశారు. వధువు ఎడ్లబండిలో మండపానికి చేరుకోగా.. మిగిలినవారంతా కాలినడకన గుట్ట ఎక్కుతూ మాంగ్లీ చేరుకున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన వారి కష్టం అంతా ఇంతా కాదు.

ఎన్నో అగచాట్లు పడుకుంటూ.. మొత్తం మీద మండపానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి ముహూర్తం దాటిపోయింది. ఇక చేసేదేమీ లేక.. ఆలస్యంగానైనా పెళ్లి తంతును ముగించారు. పెళ్లి రోజునే వధువు భవిష్యత్​ కష్టాలను ఊహించుకుని జీడిపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుభకార్యానికే ఇంత కష్టముంటే.. ఆపదొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వారిని మరింత వేదనకు గురిచేశాయి.

ఇదిలా ఉంటే 45 డిగ్రీల ఎండను లెక్కచేయక పెళ్లికి వచ్చిన వధువు తరఫు బంధువులను మాంగ్లీ గ్రామస్థులు బాగా చూసుకున్నారు. వారి దాహర్తిని తీర్చేందుకు ప్రతి చోట నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి.. ఆహ్వానం పలికారు. ఆధునికయుగంలోనూ రవాణాసౌకర్యం లేక.. ఆదివాసీలు ఇప్పటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనటానికి మాంగ్లీలో జరిగిన ఈ పెళ్లి వేడుకే ఓ నిదర్శనం.

ఇదీ చూడండి:

Last Updated : Apr 28, 2022, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.