ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ సమీపంలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఖోడద్ గ్రామానికి చెందిన విఘ్నేశ్ రైలు పట్టాలపై కూర్చొని చరవాణి చూస్తూ ప్రపంచాన్ని మరిచాడు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న రైలు సైరన్ ఇచ్చినా యువకుడు పసిగట్టలేనంతగా అందులో లీనమైపోయాడు.
రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. రైలు కిందపడి కాళ్లు విరిగాయి. అతనిని చికిత్స కోసం... అదే రైల్లో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌లో చికిత్సపొందుతూ విఘ్నేశ్... తుదిశ్వాస విడిచాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం