ETV Bharat / state

కౌశిక్​ రెడ్డికే ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు.?: మల్లు రవి - dalith girijan dandora from august 9th

దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్​ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్​ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎంతోమందిని కాదని.. కౌశిక్​ రెడ్డికే ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు ఈ నెల 9న ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి నుంచి మొదలయ్యే దళిత, గిరిజన దండోరాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

mallu ravi
మల్లు రవి
author img

By

Published : Aug 2, 2021, 7:52 PM IST

పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్యెల్సీ ఇవ్వడం వల్ల తెరాసకు కానీ, హుజురాబాద్‌కు కానీ ఒరిగేదేమీ లేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్‌ రెడ్డి ద్వారా ఆరోపణలు చేయించి అవి కాంగ్రెస్‌ పార్టీ చేసినట్లుగా మార్చారని ధ్వజమెత్తారు. ఉద్యమంలో పనిచేసిన అనేక మందిని పక్కన పెట్టి కౌశిక్‌ రెడ్డికే ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 9న ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం, స్వయంపాలన కోసం ఉద్యమించిన రోజుగా భావిస్తామని మల్లు రవి అన్నారు. అందుకే ఆరోజు గిరిజన ఆత్మగౌరవ ప్రతీకగా ఇంద్రవెల్లిని భావించి అక్కడి నుంచి పోరాటం మొదలుపెడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్​ 17 వరకు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆత్మగౌరవానికి గుర్తింపు.. భూమి, ఉద్యోగం, విద్య, రాజ్యాధికారాలుగా బాపూ పేర్కొన్నారని మల్లు రవి వెల్లడించారు. అందుకే రాజ్యాంగం ప్రకారం భూమిలేని వారికి భూమి, ఉద్యోగాలు, విద్య కోసం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ హయాంలో దాదాపు 16 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచి ఇచ్చిందని వివరించారు. హుజురాబాద్ ఉపఎన్నికలు ఉన్నాయనే "దళిత బంధు పథకం" ముందుకు వచ్చిందని మల్లు రవి ఎద్దేవా చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదని.... రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: IRRIGATION: నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.