తెలంగాణ బంద్ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు ఆదిలాబాద్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రత్యేక వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..