వ్యవసాయ పనులు నిమిత్తం రోడ్లపైకి వచ్చే రైతులు... కచ్చితంగా తమ వెంట పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. లాక్డౌన్ కాలంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఆదిలాబాద్ పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
వ్యవసాయ పనుల కోసం పట్టణ పరిధిలోకి వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం వెంట తెచ్చుకోవాలని... వాటిని చూపిస్తే రైతుల వాహనాలను స్వాధీనం చేసుకోబోమని స్పష్టం చేశారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎరువుల దుకాణాలు, వ్యవసాయ పనిముట్ల మరమ్మతు షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ