ETV Bharat / state

4 విద్యార్థుల అదృశ్యం... కుటుంబీకులు,పోలీసుల సంయుక్త గాలింపు

ఆ విద్యార్థులంతా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాధ్యమిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. జైనథ్ గ్రామానికి చెందిన ఈ 4 విద్యార్థులు... తమ మిత్రుడి జన్మదిన వేడుకలకు వెళ్తున్నామని చెప్పి కనిపించకుండా పోయారు.

విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
author img

By

Published : Dec 20, 2019, 6:12 PM IST

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రభాస్, రాజశేఖర్, అమూల్, చంద్రశేఖర్​లు కనిపించకుండా పోయారు. బుధవారం సాయంత్రం స్నేహితుడి జన్మదిన వేడుకలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రైనా ఇంటికి చేరుకోకపోవడం వల్ల ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆచూకీ తెలియదు... సర్వత్రా ఆందోళన.

ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యార్థులు హైదరాబాద్​లో ఉన్నట్లు జైనథ్​లోని మిత్రుడికి ప్రభాస్ ఫోన్ చేసి చెప్పాడు. విషయాన్ని సదరు చిన్నారి కుటుంబీకులకు తెలపడం వల్ల వారు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్​కు బయలుదేరారు. రెండు రోజులుగా పోలీసులు, కుటుంబీకులు చర్యలు చేపడుతున్నా... విద్యార్థుల ఆచూకీ లభించకపోవడం వల్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు

ఇవీ చూడండి : ఘట్​కేసర్​లో ఓ వివాహిత అదృశ్యం

Intro:TG_ADB_08_20_MISSING_TS10029 ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587 -------------------------------------------------------------- (): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామానికి నలుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. సొంత గ్రామం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రభాస్, రాజశేఖర్, అమూల్, చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం స్నేహితుని జన్మదిన వేడుకలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. తీరా రాత్రి ఇంటికి చేరుకోక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం హైదరాబాదులో ఉన్నట్లు జైనథ్ లోని స్నేహితునికి ప్రభాస్ ఫోన్ చేసి చెప్పడంతో ఆ విషయాన్ని సదరు చిన్నారి కుటుంబీకులకు తెలపడంతో వారంతా దీనికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. రెండు రోజులుగా పోలీసులు కుటుంబీకులు గాలింపు చర్యలు చేపడుతున్న వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు దారితీస్తోంది.......vssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.