ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ సరిపడా శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు లభించడం లేదు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వాటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. కొరతను తీర్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ల్యాబ్ అసోసియేషన్ ముందుకొచ్చింది.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందితో పాటు నిరుపేదలకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇదీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 10 కరోనా కేసులు