ఇదీ చూడండి :కాగితాలతో కళాఖండాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో తీజ్ సంబురాలు - రాఖీ పౌర్ణమి
ఆదిలాబాద్ ఉట్నూర్ ఏజెన్సీలో తీజ్ సంబురాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. రాఖీ పౌర్ణమి నుంచి తొమ్మిది రోజులపాటు పెళ్లి కాని యువతులు సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించారు.
ఆదిలాబాద్ ఏజెన్సీలో తీజ్ సంబురాలు
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో గిరిజనులు తీజ్ సంబురాలు జరుపుకున్నారు. గిరిజన లంబాడీలు రాఖీ పౌర్ణమి నుంచి తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తండాలో పెళ్లికాని యువతులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. రాఖీ పౌర్ణమి రోజు సాముహికంగా పూజలు చేసి.. కొత్త వెదురు బుట్టలో పొలం మట్టితో పాటు గోధుమలు పోస్తారు. ఇలా మొత్తం తొమ్మిది రోజులు పూర్తయ్యాక.. చిన్నా పెద్ద తేడా లేకుండా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారు.
ఇదీ చూడండి :కాగితాలతో కళాఖండాలు
Intro:Body:Conclusion: