ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం వృత్యాంతర శిక్షణ తరగతులను నిర్వహించింది. ఎండల తీవ్రత దృష్ట్యా తరగతులను జూన్ నుంచి ప్రారంభించాలని కోరుతూ టీచర్లు తరగతులను బహిష్కరించారు. శిక్షణలో పాల్గొని విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య వారికి నచ్చజెప్పారు. జూన్ 19 నుంచి నిర్వహించే బడిబాట కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లోని చిన్నారులను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఆదిత్య సూచించారు.
తరగతులను బహిష్కరించిన ఉపాధ్యాయులు - utnoor
ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే వృత్యాంతర శిక్షణ తరగతులను నిర్వహించి విద్యార్థుల విద్యా అభివృద్ధిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉపాధ్యాయులు మాత్రం ఎండ తీవ్రత దృష్ట్యా తరగతులను బహిష్కరించారు.