ETV Bharat / state

మద్దతు ధర ఏ పంటకు మేలు..?

జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి, సోయా పంటలకు గతేడాదితో పోలిస్తే మద్దతు ధర పెరగడంతో రైతులకు కొంత మేరకు ప్రయోజనం చేకూరనుంది. పంటల సాగుకు రైతులు చేసే ఖర్చుపై 50 శాతం అదనపు ధర కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంట చేతికొచ్చేసరికి ప్రభుత్వ మద్దతు రైతులకు లభించడం లేదు.

author img

By

Published : Jul 5, 2019, 8:41 AM IST

మద్దతు ధర ఏ పంటకు మేలు..?

జిల్లా సాధారణ సాగు 4.90 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది అయిదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తారు. తరువాత సోయా, వరి, పప్పుధాన్యాలు సాగు ఉంటుంది. ఆశించిన దిగుబడులు లేక.. గిట్టుబాటు ధర రాక నష్టపోయిన సందర్భంలో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు రైతుల్లో భరోసా నింపుతాయి. విపణిలో తక్కువ ధర ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలతో మద్దతు ధరతో రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలలో పత్తి పంటకు తక్కువ మొత్తం పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోయాకు భారీగా పెంపు ఉండటంతో మేలు చేకూరింది.

పత్తి రైతులకు నిరాశే
జిల్లాలో పత్తి సాగు 3.50 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి పంటకు గతేడాది కంటే మద్దతు ధర క్వింటాలుకు రూ.105 మాత్రమే పెంచారు. పెరిగిన పెట్టుబడులతో పోల్చుకుంటే ఇది తక్కువే. విత్తనాల ధరలు పెరగకపోయినా ఎరువులు, కూలీల ఖర్చులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు పత్తి అమ్మే సమయంలో తేమ నిబంధనలతో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర రాని పరిస్థితి ఉంది. గతేడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450 ఉంటే తేమ పేరిట కోత విధించారు. ఎక్కువ మంది రైతులకు రూ.5వేల లోపు ఇచ్చారు.

సోయా రైతులకు మేలు
పత్తి తరువాత జిల్లాలో సోయా సాగు అవుతుంది. ఈ ఏడాది 75 వేల ఎకరాల్లో సోయా సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా సోయా సాగు మరింత పెరిగే వీలుంది. గత ఏడాది కంటే సోయాలో క్వింటాలుకు రూ.311 పెరిగింది. ప్రకటించిన 14 పంటలలో అధికంగా సోయా పంటకు మద్దతు ధర ఎక్కువగా పెరిగింది. గత ఏడాది క్వింటాలు సోయా రూ.3,399 ఉండగా, ఈ ఏడాది 3,710కి పెంచారు.

పప్పులకు ఫర్వాలేదు
గతంలో పప్పుధాన్యాల ధర బాగా పెరిగిపోవడంతో రైతులు పప్పుధాన్యాలు సాగు చేసేందుకు వీలుగా గత ఏడాది మద్దతు ధరలను భారీగా పెంచింది. గతంతో పోలిస్తే రెండేళ్లలో క్వింటాలుకు వేయి రూపాయిల పెరుగుదల ఉంది. ఈ ఏడాది మళ్లీ తగ్గించారు. కంది, పెసర, మినుములకు పెరుగుదల రూ.100లోపు ఉంది.

ఆరుతడికి అంతంత మాత్రమే
జిల్లాలో వానాకాలం, యాసంగిలో ఆరుతడి పంటల కింద మొక్కజొన్న, జొన్న, నువ్వులు పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతాయి. జిల్లా మొత్తంలో 12 వేల ఎకరాల్లోపు ఉంటుంది. వీటికి మద్దతు అంతంత మాత్రంగానే పెరిగింది. పైగా విపణీలో తక్కువ ధర ఉన్నప్పుడు, ఉత్పత్తుల రాక ఎక్కువగా లేకపోవడంతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు.

Dear Team

As I discussed with you 

Please publish the article &  share the link ASAP

--
Thanks & Regards,
N V Jagadeesh Kumar T
Deputy Manager  - Analytics
Mobile No - 6309949918

For All Latest Updates

TAGGED:

agri
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.