విద్యార్థినికి సైకిల్ బహూకరించిన కలెక్టర్ పాఠశాలకు గైర్హాజరు కాకుండా వస్తున్న విద్యార్థినికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్.. సైకిల్‌ను బహూకరించారు. హాజరు మాసోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి. సుస్మితకు అందజేశారు. తొమ్మిదో తరగతిలో వంద శాతంతో పాటు ప్రస్తుత ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా వెళ్లడం పట్ల బాలికను పాలానాధికారి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర రెడ్డి, మండలాల జడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి;తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'