ETV Bharat / state

సర్కారీ ఊళ్లు: ఉద్యోగం ఆ  పల్లెల లక్షణం! - ఆదిలాబాద్​ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులపై కథనం

ఉద్యోగం పురుష లక్షణమంటారు. కానీ ఈ గ్రామాలను చూస్తే ప్రభుత్వ కొలువు ఈ పల్లెల లక్షణం అనక మానరు. కష్టపడి ఉద్యోగాలు సాధించడం ఈ గ్రామాల ప్రత్యేకత. మూడిళ్లకు ఒకరు ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు. వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే కావడం మరో విశేషం. అంతేకాదు.. తమకు మంచి భవిష్యత్తునిచ్చిన గ్రామాన్ని ప్రగతి బాటలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. కొలువుల చిరునామాగా నిలుస్తున్న ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాంద(టి), బోథ్‌ మండలం సొనాలపై ‘'ఈటీవీ భారత్​'’ ప్రత్యేక కథనం..

story on government of employees adilabad district
సర్కారీ కొలువులకు.. ఆ గ్రామాలు నెలవు..
author img

By

Published : Dec 26, 2020, 1:09 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న చాంద(టి) గ్రామం భావితరాలకు బాటలు వేస్తూ ఆదర్శ గ్రామంగా ముందడుగు వేస్తోంది. నిజాం కాలంలోనే గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయడంతో యువకులు ఉన్నత చదువుల వైపు సాగారు. 1960లో గ్రామానికి చెందిన ఆరె బాపురావు ‘'డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌’'గా మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఆయన ప్రోత్సాహంతోనే అనతి కాలంలోనే చాలా మంది వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ కొలువులు సాధించిన వారు ఆ గ్రామం నుంచి 260 మందికి పైగా ఉన్నారు. అందులో ఉపాధ్యాయులే 55 మంది ఉంటారు. 38 మంది పోలీసు శాఖలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తుండగా ఇద్దరు వైద్యులుగా సేవలు చేస్తున్నారు. 60 మంది పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నారు. గ్రామానికి చెందిన ఆరె శ్రీనివాస్‌ ఉస్మానియా యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రాణాంతక వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే వారు మరో 10 మంది ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు 50కి పైగా ఉన్నారు. వీరంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే కావడం విశేషం.

సంఘంగా ఏర్పడి.. గ్రామాభివృద్ధికి తోడ్పాటు

సొంతూరికి ఉపకారం చేయాలనే సంకల్పంతో చాంద(టి)లోని ఉద్యోగులంతా కలిసి ‘మిత్ర పూర్వ విద్యార్థుల సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. ప్రస్తుత పాఠశాలకు రూ.2 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం గ్రామం నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వైద్యులతో ముఖాముఖి, వ్యక్తిత్వ వికాస నిపుణలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏటా అంతా కలిసి చేయాల్సిన పనుల గురించి చర్చిస్తారు.

సొనాల.. ఎందరికో స్ఫూర్తి..

బోథ్‌ మండలంలోని సొనాలలో ఏకంగా 350కి పైగా ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. వీరిలో 150 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. మిగిలిన వారిలో 40 మంది ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తుండగా.. 30 మంది పోలీసు శాఖలో వివిధ పోస్టుల్లో ఉన్నారు. బ్యాంకుల్లో 16 మంది, వైద్యశాఖలో 17 మంది గెజిటెడ్‌ హోదాలో ఉద్యోగాలు పొందడం విశేషం. మిగిలినవారిలో పంచాయతీరాజ్‌, తపాలా, పశుసంవర్ధకశాఖ, అటవీశాఖతో పాటు ఇతర ప్రభుత్వశాఖల్లోనూ వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అంతేకాదు ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఇంటి పట్టునే ఉంటూ కష్టపడి ఇష్టమైన కొలువులను సాధించారు. గ్రామానికి చెందిన కె. రాజేశ్వర్‌ 1965లో తొలిసారిగా ఉపాధ్యాయుడిగా ప్రభుత్వోద్యోగాన్ని సంపాదించారు. ఆయన స్ఫూర్తితో కొద్ది కాలంలోనే 15 మంది ఉపాధ్యాయులుగానూ, మరో అయిదుగురు వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాలు సంపాదించారు. వాళ్లే తరువాతి వారికి మార్గదర్శకులయ్యారు. అన్ని రకాల అభివృద్ధికీ చదువే మూలం అన్న విషయాన్ని గ్రామస్థులకు అర్థమయ్యేలా చేశారు. 2012లో సొనాల నుంచి ఏకంగా 18 మంది యువకులు ఒకేసారి డీఎస్సీలో అర్హత సాధించి, ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

విద్యార్థులకు చేయూత..

సొనాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యువతకు సర్కారు కొలువులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలో పరీక్షలు రాసేటప్పుడు, ఇంటర్వ్యూల్లో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తారు. తమ అభివృద్ధికి కారణమైన పాఠశాల ప్రగతి కోసం కృషి చేస్తున్నారు. పాఠశాల బ్యాంకు ఖాతాలో నగదు జమచేసి ప్రతి సంవత్సరం ఆ డబ్బుకు వచ్చే వడ్డీని పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బహుమతిగా ఇస్తున్నారు.

ఇదీ చదవండి: అనాథలకు అక్క అయింది... ఈ పల్లవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.