ETV Bharat / state

సోయా విత్తనాల కొరత.. ఆందోళనలో ఆదిలాబాద్​ రైతన్న - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

నియంత్రిత సాగు కింద ఆదిలాబాద్‌ జిల్లలో పత్తి, సోయా పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఊరూరా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. వర్షాల పలకరింపుతో పత్తి సాగుకు కసరత్తు మొదలైనా.... సోయా విత్తన కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. అధికారులు చేతులెత్తేడం వల్ల.. ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొంది.

సోయా విత్తనాల కొరత.. ఆందోళనలో రైతులు
సోయా విత్తనాల కొరత.. ఆందోళనలో రైతులు
author img

By

Published : Jun 9, 2020, 2:29 PM IST

Updated : Jun 9, 2020, 2:47 PM IST

సోయా విత్తనాల కొరత.. ఆందోళనలో రైతులు

ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి తర్వాత సాగయ్యే ప్రధాన పంట సోయా. నియంత్రిత సాగులోనూ జిల్లాలో ఇవే పంటలు సాగు చేసుకోవచ్చని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంకేముంది తెలిసిన పంటలే కదా...! అని అనుకున్న రైతుల సంతోషం కొద్ది రోజులకే పరిమితమైంది. పత్తి పంటకు బదులు సోయా విస్తీర్ణం పెంచుదామనుకున్న అన్నదాతలకు విత్తన లేమి నిరాశకు గురిచేస్తోంది. జిల్లాలో రాయితీ విత్తనాలు లభించక... ప్రైవేటు కంపెనీలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. విత్తేందుకు సమయం సమీపిస్తుండటం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సరిపడా విత్తనాలు రాక అధికారులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ఆయా వ్యవసాయ కార్యాలయాలకు.. రైతులు వచ్చిపోతున్నా సమాధానాలు చెప్పట్లేదని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం... సాగుకు నెలాఖరు వరకు సమయం ఉందని... అంతగా అవసరమైతే మార్కెట్‌లో లభ్యమయ్యే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు.

"ఆదిలాబాద్​ జిల్లాకు గాను 27 వేల 934 క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ విత్తనాలు వేసుకోడానికి జూన్​ 30 వరకు సమయం ఉంది. అయితే ఇప్పటికే మనకు 3 వేల 300 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు తరలించడం జరిగింది."

-ఆశాకుమారి జిల్లా వ్యవసాయాధికారి

"మనకు ముఖ్యంగా మధ్యప్రదేశ్​ భోపాల్​ నుంచి ప్రతిసారి సోయ విత్తనాలు వస్తాయి. ఈసారి లాక్​డౌన్​ ఉండటం వల్ల సీడ్స్​ సర్టిఫికేషన్​ ఏజెన్సీలన్నీ మూతపడి ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పనులు మొదలయ్యాయి కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది."

-అష్రఫ్‌, మండల వ్యవసాయాధికారి

విత్తనాల కొరతపై విపక్షాలు ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. జిల్లాకు సోయా విత్తనాలు సరఫరా చేయాలంటూ జిల్లా వ్యవసాయ కార్యాలయం ఎదుట భాజపా ధర్నా చేపట్టి వ్యవసాయాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఇదీ చదవండి: మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా

Last Updated : Jun 9, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.