లాక్డౌన్ తొలి రోజునే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్య తలెత్తింది. ఉదయం 6 గంటలకే డీలర్లు దుకాణాలు తెరవగా... పెద్ద ఎత్తున జనాలు రేషన్ బియ్యం కోసం చేరుకున్నారు. ఈ పాస్ యంత్రంలో సర్వర్ సమస్య తలెత్తడం వల్ల బియ్యం పంపిణీ నిలిచిపోయింది.
మూడు గంటల పాటు కార్డుదారులు పడిగాపులు కాయగా... తొమ్మది గంటల తర్వాత సమస్య తీరింది. బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్