ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం వల్ల మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణ పరిధిలోని క్షౌరశాలల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయాలని సూచిస్తోంది.
ఇందులో భాగంగా క్షౌరశాలల్లో మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ మారుతీప్రసాద్ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి... శానిటైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇదీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'