పెన్‌గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా - పెన్‌గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ నది ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వంద ట్రాక్టర్లకు తగ్గకుండా ఇసుక అక్రమ రవాణ జరుగుతోంది. జైనథ్ మండలం డొల్లార సమీపంలో జరుగుతున్న దందా పరిశీలన కోసం వెళ్లిన ఈటీవీ-ఈనాడు ప్రతినిధులను చూడగానే ట్రాక్టర్లు సహా మాఫియాకు చెందిన వ్యక్తులు పరుగు పెట్టారు. అక్రమ ఇసుక దందాకు యథేచ్ఛగా సాగుతుండటం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్ధంపడుతోంది. క్షేత్రస్థాయి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...