కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 24న సమతపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అదే మండలానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దుంలను నిందితులుగా గుర్తించిన పోలీసులు డిసెంబర్ 16న ఛార్జిషీట్ దాఖలు చేశారు.
హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైన సాక్షుల విచారణ డిసెంబర్ 31తో ముగిసింది. మొత్తం 25 మంది చెప్పిన సాక్ష్యాలను ప్రత్యేక కోర్టు ఈరోజు నిందితులకు వివరించగా... దానికి వాళ్లు అంగీకరించలేదు. తాము నేరం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకురావడమే కాకుండా... తమ తరఫున సాక్షులు కూడా ఉన్నారని వివరించారు. వారి తరఫున సాక్ష్యాలను వినేందుకు అంగీకరించిన ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈనెల ఆరో తేదీకి వాయిదావేసింది.