ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉట్నూర్ డిపోలో 32 బస్సులు ఉండగా ఈరోజు 22 బస్సులు ఉదయం 6 గంటలకే వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్డౌన్ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. కానీ బస్సు సీట్లపై ఎలాంటి గుర్తులు పెట్టలేదు.
అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్ అందజేశారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు.