ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు, పోలీసు శాఖ తరపున డ్రైవర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. మద్యం తాగి మత్తులో వాహనాలను నడపకూడదని సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. మద్యం మత్తులో వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి వాహనానికి లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, బీమా, కాలుష్యం తదితర సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
ఇచ్చోడలో జాతీయ భద్రతా వారోత్సవాలు - ఇచ్చోడలో జాతీయ భద్రతా వారోత్సవాలు
జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఇచ్చోడలో రవాణా శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహన చోదకులకు అవగాహన కల్పించారు.