ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కొంత సడలింపు ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన 21 కరోనా పాజిటివ్ కేసుల్లో.. శనివారం ఐదుగురు, నేడు మరో ముగ్గురు బాధితులు డిశ్ఛార్జి అయ్యారు. ఫలితంగా జిల్లాలోని 19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో 16 చోట్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాకపోకలకు సడలింపు ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో 20 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉండగా.. అందులో 12 కంటైన్మెంట్ ప్రాంతాల్లో సడలింపు ఇచ్చారు. లాక్డౌన్ను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు.
మరోవైపు జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వలస జీవులకు పలువురు మానవతావాదులు అన్నదానం చేస్తూ ఔదార్యం చాటుతున్నారు. మార్వాడీ మంచ్ ఆధ్వర్యంలో వందలాది మందికి గొడుగులు పంపిణీచేశారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?