ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తొలిరోజు కావడం వల్ల రైతులు భారీగా పత్తిని తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో వేలంపాట నిర్వహించారు. వ్యాపారులు క్వింటాలుకు 4,950 రూపాయల ధర నిర్ణయించగా, రైతులు ఒప్పుకోలేదు. దీంతో వ్యాపారులు వెనుదిరిగారు.
సీసీఐ కనీస మద్దతు ధర 5,550 రూపాయలు ఉండగా, తేమ నిబంధన దృశ్యా రైతులు సీసీ వైపు మొగ్గు చూపకపోవడం వల్ల వ్యాపారుల పాత్ర కీలకంగా మారింది. ఇదే అదనుగా వ్యాపారులు మొండి కేయడం వల్ల కొనుగోళ్లలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వ్యాపారులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్ కార్యాలయం వద్ద గుమి గూడి ధర నిర్ణయంపై పడికాపులు కాస్తున్నారు.
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా