Real Estate Frauds Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల దౌర్జన్యం రోజురోజుకు పెచ్చుమీరిపోతోంది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న 346 ప్రభుత్వ సర్వే నంబర్‌లో భూములకు ఎసరుపెట్టేందుకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు.. బినామీ పత్రాలు సృష్టించిన విషయం బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆ సర్వే నంబర్ పక్కనే ఉన్న 68 సర్వే నంబర్‌లో ఇళ్ల స్థలాలు ఉన్న పేదలపై జులం ప్రదర్శించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా ఖానాపూర్ కాలనీ పరిధిలోకి వచ్చే సర్వేనంబర్ 68/44, 68/52, 68/44/1లో.. ఏళ్ల క్రితమే పలువురు సామాన్యులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటిని కాజేసేందుకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు కొత్త నాటకానికి తెరలేపారు.
Prathidwani : కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. ఎందాకా ఈ జోరు?
Illegal Land Occupations Adilabad : ఆదిలాబాద్ కేంద్రంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులతో సత్ససంబంధాలు కలిగిన స్థిరాస్తి వ్యాపారుల ముఠా ఒకటి బినామీ పత్రాలతో భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడాలేకుండా కాజేసే దందా సాగుతోంది. అమాయకులను భయపెట్టి.. అందినకాడికి దండుకునే జులుం కొనసాగుతోంది. కొంతమంది మహిళలను రంగంలోకి దించి ఇంటిస్థలాలు కలిగిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదరించడం కలకలం సృష్టిస్తోంది. అక్రమార్కుల నుంచి తమను కాపాడాలనే సామాన్యుల వేదన అరణ్యరోదనగా మిగులుతోంది.
"2018లో నేను ఈ భూమిని తీసుకున్నాను. నాపేరుపై రిజిస్ట్రేషన్ అయింది. నేను ఇళ్లు కట్టుకోవాసని అనుకున్నాను. శ్రీను అనే వ్యక్తి వచ్చి నా భూమి చుట్టు కర్రలు పాతాడు. 40 50 మందిని తీసుకువచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. కొందరు రియస్ ఎస్టేట్ వ్యాపారులు దొంగ డాంక్యుమెంట్స్ సృష్టించి ఈ ఆక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలను చూసి వారినే టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు." - బాధితులు
ఆదిలాబాద్‌లోనే గతంలో 109 అనధికారిక లేఅవుట్లున్నట్లు గుర్తించిన అధికారులు... బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అక్రమార్కులకు కలిసివస్తోంది. గతంలో పనిచేసిన ఒకరిద్దరు ఆర్డీవోలతోపాటు తహశీల్దార్లు సైతం అక్రమార్కులకు అండదండలు అందించడంమే.. బినామీ పత్రాల తయారీకి ఓ కారణమని బాధితులు చెబుతున్నారు. తాజాగా బినామీ పత్రాలు బయటపడినట్లు తమదృష్టికి వచ్చినట్లుగా అంగీకరిస్తున్న ప్రస్తుత అధికారులు అన్నికోణాల్లో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం విశేషం.
"ఇక్కడ 68 నంబరు పైన విచారణ చేస్తే ఆ నంబరుపై ఫేక్ డాంక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన ఫైల్స్ చూస్తే అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై కేసు నమోదు చేస్తాం. చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం." - శ్రీనివాస్, తహశీల్దార్, ఆదిలాబాద్ అర్బన్
రెవెన్యూ, స్థానిక సంస్థలకు వేర్వేరు అదనపు పాలనాధికారుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా భూ సమస్యలు తలెత్తడం అధికారుల ఉదాసీనవైఖరిని వెల్లడిస్తోంది. అక్రమార్కులకు అలవాటు పడిన స్తిరాస్థివ్యాపారుల భూదందాను అరికట్టడంలో యంత్రాంగం చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తోంది.
Prathidwani : హైదరాబాద్.. 'రియల్' బాద్షా
PRATHIDWANI : రాష్ట్రంలో ఏర్పాటైన రెరా.. ప్లాట్లు కొనేవారికి మేలు కలుగుతుందా?
'రూ.1,000 కోట్ల భూకుంభకోణాన్ని బయటపెట్టాను.. కేటీఆర్ సార్ మీరే నన్ను కాపాడాలి'