ETV Bharat / state

Pre Fabricated Houses : భలే చౌక బేరం.. రూ.3 లక్షలకే ​ఇళ్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు - గిరిజనులకు రూ3 లక్షలకే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు

Pre Fabricated Houses In Adilabad : ఈరోజుల్లో రూ.6 లక్షలు నుంచి రూ.8 లక్షల్లో ఇళ్లు నిర్మాణం అయిపోతుంది అంటే ఎవరైన నమ్ముతారా. అదీ కూడా ఆ ఇంట్లో రెండు బెడ్​ రూంలు, కిచెన్​, బాత్​ రూం, హాల్​ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయనుకోండి. అంతే కాదు ఆ ఇంటిని వేరే చోటుకు కూడా తీసుకొని వెళ్లవచ్చు. వీటినే ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ ఇళ్లని అంటున్నారిప్పుడు. మరి వీటి స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

Pre Fabricated
Pre Fabricated
author img

By

Published : May 30, 2023, 1:50 PM IST

Pre Fabricated Houses In Adilabad : గిరిజనులు ఎక్కువగా తమ ఇళ్లను తాటాకులు, వెదురు కర్రలతో నిర్మించుకొని.. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి జీవనం ఎంతో ప్రమాదకరంగా ఉంటూ.. నిత్యం ఏదో ఒక విపత్తుతో యుద్ధం చేస్తూనే ఉంటారు. వర్షాలు పడితే చాలు ఆ పురిగుడెసెలు వర్షపు నీటితో నిండిపోతాయి. ఈ బాధల నుంచి బయటపడి ఇంటి నిర్మాణం చేసుకోవాలన్న.. అది వారి వ్యయప్రయాసలకు ఎంతో దూరంగా ఉంటుంది.

నిర్మాణంలో ఉన్న ప్రీ ఫ్యాబ్రియేటెడ్​ ఇళ్లు

ఒక చిన్నపాటి ఇనుప రేకులతో నిర్మించిన ఇంటికే ఈరోజుల్లో కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అలాంటిది గిరిపుత్రులకు గృహ నిర్మాణం అంటే.. వారి తలకు మించిన భారంగానే చెప్పవచ్చు. ఎందుకంటే తినడానికి తిండి సరిగ్గా దొరక్కా బతుకు జీవుడా అంటూ ఆదివాసీలు అరణ్యాలలో నివసిస్తారు. వీరి బాధలను చూసి గతంలో కుమురం భీం జిల్లా అడిషినల్​ కలెక్టర్​గా పని చేసిన వరుణ్​ రెడ్డి ప్రస్తుతం నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారు. వారికి మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.

Pre Fabricated Houses For Tribal People In Adilabad : అందుకే తాను శిక్షణ తీసుకున్న వేర్వేరు రాష్ట్రాల్లో గృహ నిర్మాణ శైలులను గమనించి.. చివరికి ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ విధానమే ఉత్తమ విధానం అని వరుణ్ రెడ్డి గ్రహించారు. ఆ విధానం తనను ఆకట్టుకోవడంతో ఆ ఆలోచనలను అప్పటి కలెక్టర్​ రాహుల్​రాజ్​ దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా కలెక్టర్​కు బాగా నచ్చి.. ట్రైబల్​ వెల్ఫేర్​ అధికారులు, పంచాయతీరాజ్​, ఆర్​అండ్​బీ ఇంజినీర్లతో సర్వే చేయించారు. దీంతో ఆ నిర్మాణాలపై ఓ కొలిక్కి వచ్చారు. ఇది అద్భుతమైన నిర్మాణమని.. లాభాలే కానీ ఇందులో నష్టాలు లేవని గ్రహించి కుమురం భీం జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్నారు. అందుకు తగ్గట్టే తిర్మాణిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కెరమెరి మండలం శివగూడ తండాల్లో ఇల్లు నిర్మించారు. ఇందుకు ఆ గిరిజన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఫ్యాబ్రికేటెడ్​ ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుపుతారు : ఈ ఫ్యాబ్రికేటెడ్​ నిర్మాణంలో ఒక్కో ఇంటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతారు. మొట్టమొదట సిమెంట్​ మిశ్రమంతో తయారు చేసిన 75 ఎంఎం మందం గల ఏరోకాన్​ ప్యానళ్లను అమరుస్తారు. 75 ఎంఎం రాడ్లు అంటే మూడు అంగుళాలు మందం ఉన్నవి. ఆ తర్వాత టాటా ఏరోనాటికల్​ షీట్స్​ వారి సాయం తీసుకొని.. పైకప్పు రేకుల ద్వారా వేసవిలో వేడి నుంచి రక్షణ పొందేందుకు పాల్​ సీలింగ్​ వేయిస్తున్నారు. టైల్స్​ ఫ్లోరింగ్​, లప్పం, విద్యుత్​, నల్లాలు,రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే ఒక కుటుంబం నివసించడానికి ఉండే ఇళ్లు.. కేవలం రూ.3 లక్షలకే సిద్ధం. ఇలా నిర్మించిన ఇళ్లు 25 ఏళ్లు పాటు మన్నికలో ఉంటుందని ఇంజినీరింగ్​ నిపుణులు చెబుతున్నాయి.

ప్రకృతి విపత్తులు నుంచి రక్షించి.. అగ్ని ప్రమాదాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని వారు స్పష్టం చేశారు. ఒక్కోసారి వీరిలోనే వీరికే ఒక ఊరి ఆదివాసీలకు.. మరొక ఊరి ఆదివాసీలకు గొడవలు జరిగినప్పుడు.. కొన్ని వర్గాలుగా చీలిపోయి అడవికి దూరంగా తాత్కాలిక గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తారు. అలాంటప్పుడు ఈ ఇళ్లు బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటారా వీటిని మనం ఎక్కడకు వెళితే.. అక్కడకు తీసుకెళ్లవచ్చు. అంటే రెడీమేడ్​ ఇళ్ల తరహాలో.. విప్పుకొని ఆ సామగ్రిని తమ వెంట తీసుకొని వెళ్లవచ్చు.. మళ్లీ నిర్మించుకోవచ్చు.

గిరిజన గ్రామాల్లో ఈ ఇళ్లకు పెరుగుతున్న ఆదరణ : ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలే అధికంగా ఉంటాయి. ఈ ఏజెన్సీలోని గిరిజనుల్లో కొలాంలు అన్ని రంగాల్లోనూ అత్యంత వెనుకబడి ఉంటూనే ఉన్నారు. వీరు పూరి గుడిసెలను కొండల్లోనూ, గుట్టల్లోనూ నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి వీరి కోసం కుమురం భీం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్​ విధానంలో 40 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు సీసీడీపీ నిధులు అందిస్తున్నారు.

Pre Fabricated Houses Rs 3 Lakhs : ఈ పనులను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించి.. మొదట కుమురం భీం జిల్లా కెరమెరి మండలం శివగూడలో ప్రయోగాత్మకంగా 13 ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లు చూడడానికి బాగానే ఉండడంతో తిర్యాణి మండలం భీంజిగూడ పంచాయతీ పరిధిలోని బుగ్గగూడలో 13, సిర్పూర్​ మండలం కొలాంగూడ వేంపల్లిలో 12 చొప్పున ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 13 పూర్తికాగా తొమ్మిది నిర్మాణంలోనూ.. మిగిలినవి ప్రారంభించాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా 92 ఇళ్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. వీరికి డబుల్​ బెడ్​ రూం ఇళ్లను తక్కువ రోజులలోనే కడుతున్నారు. దీని బాత్​రూం, వంటగది, హాల్​ వంటివి ఉంటాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.