ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఉట్నూర్, జైనూర్, నార్నూర్ మండలల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాన మొదలైంది. వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీరు చేరింది.
ఇదీ చదవండి: మేడిగడ్డ వద్ద గోదారి పరవళ్లు.. అన్ని బ్యారేజీలు నీటితో కళకళ