ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలను తీసుకొచ్చి అందంగా బతుకమ్మను తయారు చేశారు. అనంతరం అందరూ ఒక్కచోట చేరి గౌరమ్మకు దీపారాధన చేసి వాటి చుట్టూ కోలాటం ఆడారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు ఎంఈవో రాథోడ్ ఉదయరావు హాజరయ్యారు.
ఇవీ చూడండి: దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... బాధ్యులు ఎవరు...?