ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఐక్యకార్యాచరణ కమిటీ చేపట్టిన సమ్మెకు... రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. స్థానిక సుందరయ్య భవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి తెరాస, భాజపా నేతలు మినహా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రసాధనలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం విస్మరించడం బాధ్యతారాహిత్యంగా నేతలు అభివర్ణించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టే ఆందోళనకు... అన్నివిధాలుగా మద్దతు ఇవ్వడమే కాకుండా... ప్రజాస్వామిక పద్ధతిలో ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి