ఆదిలాబాద్‌లో పుర ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువు మిగిలి ఉండటం వల్ల అభ్యర్థులు వచ్చిన అవకాశాలను వినియోగింటుకుంటున్నారు. శుక్రవారం సందర్భంగా మసీదుల వద్ద ప్రార్థనలు నిర్వహించుకుని బయటకు వచ్చిన ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని తమకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఆయా మసీదుల వద్ద రాజకీయ నాయకుల సందడి నెలకొంది. తెరాస, కాంగ్రెస్ నాయకులు... మసీదుల ముందు వరుసకట్టి పరోక్ష ప్రచారం నిర్వహించారు.
ఇవీ చూడండి : బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్