ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం.. పోలీసుల అప్రమత్తం - Maoist latest news

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో కూంబింగ్‌ నిర్వహించారు. బోథ్ మండలంలో స్టీల్‌ డబ్బాలో అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు.

మావోయిస్టులు
మావోయిస్టులు
author img

By

Published : Sep 1, 2022, 12:41 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో స్టీల్‌ డబ్బాలో పేలుడు పదార్థాలను గుర్తించారు. మావోయిస్టులే బాంబు అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిగిని, కంఠేగావ్‌, కైలాసటేక్డీ, బాబెరా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు కుమురం భీం జిల్లా తిర్యాణి మండలంలో ప్రాణహిత నది మీదుగా మావోయిస్టులు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు దళాలు వారం నుంచి అడవులను జల్లెడ పడుతున్నాయి. గ్రామ పెద్దలతో కలిసి ప్రజలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిర్పూర్-టీ, బెజ్జూరు, దహెగం, పెంచికల్‌పేట్‌ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో.. నిర్బంధ తనిఖీలు చేప్టటారు.

ప్రతి ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆడెల్లు ఆలియాస్ భాస్కర్ దళం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులకు సవాల్‌ విసురుతోంది. భాస్కర్‌ను పట్టుకోవడానికి 2020 సెప్టెంబర్‌లో డీజీపి మహేందర్‌రెడ్డి.. ఆసిఫాబాద్‌లోనే మకాం వేశారు. అప్పట్లో 11 మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేశారు. 2020 సెప్టెంబర్‌లోనే ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కొత్తగా దళంలోకి నియామకాల కోసమే భాస్కర్‌ దళం సంచరిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: మంజీరా పైప్​లైన్​ పగిలింది.. దుకాణాల్లోకి నీరు చేరింది

మార్కులు వేయలేదని టీచర్​ను చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.