ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ శాఖ పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఆరా తీశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న సందర్భంగా మండల, జిల్లా కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
అలాగే ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితి సమీక్షించారు. హిందూ ముస్లిం అందరినీ కలిపి శాంతి సమావేశాలు నిర్వహించాలని.. చట్ట ప్రకారం నడుచుకునేలా అవగాహన కల్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ