Police Arrested Women: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ శివారులో ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న గ్రామస్థులను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి గుడిసెలను తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్థుల నడుమ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కజ్జర్ల గ్రామ సమీపంలోని కజ్జర్లలోని సర్వే నంబర్-142లోని ప్రభుత్వ భూమిలో దళితులు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి నుంచి వెళ్లిపోవాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిలో గతంలో తమకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని స్థానికులు వెల్లడించారు.
అధికారుల తీరును నిరసిస్తూ కొన్ని రోజులుగా దళిత మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. తమకు భూములు కేటాయించగా.. ఇటీవల కొందరు భూమాఫియాదారులు అక్కడ ప్లాట్లు చేస్తున్నారని గత కొన్ని రోజులుగా దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున పోలీసులు అక్కడికి చేరుకుని గుడిసెలు వేసుకున్న వారిని అరెస్టు చేశారు. మహిళలను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్ట్‌ను ఖండిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: