ETV Bharat / state

లక్ష్యం కొండంత.. మొక్కలకు కొరత.. - ఆదిలాబాద్‌ హరితహారం వార్తలు

భారీ లక్ష్యం.. అయిదు విడతల హరితహారంలో లక్ష.. రెండు లక్షల మొక్కలకు పరిమితమయ్యేది. కానీ ఈ ఏడాది బల్దియా ఏకంగా 10లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. లక్ష్యం భారీగా ఉండటం.. జిల్లాలో అంత పెద్ద సంఖ్యలో మొక్కలు లభించే పరిస్థితి లేకపోవడంతో బయటి ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం విధించిన లక్ష్యం అధికారులు చేరుకుంటారా లేదా అనేది సందేహంగా మారింది.

HARITH HARAM
HARITH HARAM
author img

By

Published : Jul 3, 2020, 4:11 PM IST

ఆదిలాబాద్‌ బల్దియాలో అధికారికంగా హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీన ప్రారంభించారు. ఒకేరోజున మావల నుంచి చాందా(టి) వరకు 7వేలు మొక్కలు, దుర్గానగర్‌ అర్బన్‌ పార్కులో మరో 3వేల వరకు మొక్కలు నాటారు. పురపాలకం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నర్సరీలో లక్ష మొక్కలు ఉండగా అటవీశాఖ ద్వారా మరో లక్ష వరకు మొక్కలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా రెండు నర్సరీలు ఏర్పాటుచేయాలని భావించినా..ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు.

ప్రభుత్వ సూచన మేరకు హైదరాబాద్ సమీపంలోని కొంపల్లి నుంచి మరో లక్షన్నర వరకు కొనుగోలు చేసి తీసుకొస్తామంటున్నారు. ఇలాగైనా మొత్తం మూడున్నర లక్షల వరకు మాత్రమే మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని జిల్లా కొనుగోలు కమిటీ సూచన మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కొనుగోలు చేసి తీసుకురానున్నారు. ఇటీవల నాటిన మొక్కల్లో 7వేలు అక్కడ్నుంచే తెప్పించారు. పచ్చదనం పెంపుకోసం పురపాలక బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయించడంతో కొనుగోలు ప్రక్రియ సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు. రోడ్లపక్కన, కాలనీల్లో 5లక్షలు, ఇంటింటికి మరో 5లక్షలు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు.

సవాల్‌గా మారనున్న రక్షణ

మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించడం అధికారులకు సవాలుగా మారనుంది. ఇది వరకు నాటిన మొక్కల్లో చాలా వాటికి రక్షణ కంచెలు బిగించకపోవడంతో పెట్టిన కొన్నాళ్లకే కనిపించకుండాపోయాయి. ప్రస్తుతం 15వేల వరకు మాత్రమే ట్రీగార్డులు తెప్పిస్తున్నారు. కానీ నాటే మొక్కల సంఖ్య మాత్రం భారీగా ఉంది. ఈ నేపథ్యంలో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారనుంది. పురపాలక నూతన చట్టం ప్రకారం ప్రభుత్వం మొక్కల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నిర్లక్ష్యం చేస్తే అధికారులతో పాటు స్థానిక కౌన్సిలర్లు కూడా ఇందుకు బాధ్యులవుతారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నాటిన మొక్కలు పశువుల బారిన పడకుండా కంచె ఏర్పాటుచేయడం, ట్రీగార్డులు అమర్చడం వంటిని చేపడితేనే ప్రయోజనం ఉంటుంది.

కొనుగోలు చేసి తెప్పిస్తాం

ప్రభుత్వం విధించిన లక్ష్యం చేరుకునేందుకు మొక్కలను బయటి నుంచి కొనుగోలు చేసి తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే రాజమండ్రి నుంచి తెప్పించాం. వారు ఎన్ని మొక్కలైనా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నాటిన చిన్న మొక్కలన్నింటికీ రక్షణ తొడుగులు బిగిస్తాం. మొక్కల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం.

- మారుతి ప్రసాద్‌, పురపాలక కమిషనర్‌

హరితహారంలో భాగంగా పాత జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కలు ఇవి. వీటికి రక్షణ కంచెలు ఏర్పాటుచేస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే పశువుల బారినపడే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.