ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు అర్జీదారులు పోటెత్తారు. జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యా రాణి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల సమస్యలు విన్న ఆమె.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సమస్యలు వివరించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అర్జీదారులు ప్రజావాణి విభాగం ఎదుట బారులు తీరారు.
ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!