ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనగ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రూ.5,100 మద్దతు ధరతో కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రామాల వారీగా త్వరలో షెడ్యూలు ప్రకటించి అన్ని యార్డుల్లో కొనుగోలు మొదలుపెడతామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
రైతులు ఆందోళన చెందకుండా శనగలు ఆరబెట్టి తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోళ్ల ప్రారంభోత్సవంలో జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, డెయిరీ, డీసీసీబీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు లోక భూమారెడ్డి, కాంబ్లే నాందేవ్, మెట్టు ప్రహ్లాద్, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, సహకార, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు: హరీశ్ రావు