ఆదిలాబాద్ జిల్లా రైతులకు శనగ డబ్బులు చెల్లించాలి ఆదిలాబాద్ జిల్లాలో పదివేల మంది రైతులకు తాము అమ్మిన శనగలకు డబ్బులు రావడంలేదంటూ భాజపా ఆందోళన బాట పట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్.. పాలనాధికారి దివ్య దేవరాజన్‌ను కలసి సమస్యను విన్నవించారు. త్వరలో రైతులకు డబ్బులు అందేలా చూస్తానని ఆమె భరోసానిచ్చారు. రైతులకు డబ్బుల చెల్లింపులో ప్రభుత్వ తీరును భాజపా నేత దుయ్యబట్టారు.ఇవీ చూడండి: 'నూతన సచివాలయం... 27న శంకుస్థాపన'