ఆదివాసీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సోయం బాపూరావు చిత్ర పటానికి ఆదివాసి మహిళా సంఘం సభ్యులు పాలాభిషేకం చేశారు. గత రెండేళ్ల నుంచి ఆదివాసుల సంక్షేమం కోసం ఉద్యమం చేస్తున్న సోయం బాపూరావు చిత్రం ముందు చెప్పులు ఉంచడం మరీ దారుణమని సంఘం సభ్యులు రాంబాయి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో లంబాడ జాతికి చెందిన రాథోడ్ రామ సెల్ఫోన్లో సోయం బాపూరావు చిత్రం ముందు చెప్పులు ఉంచడం చాలా దారుణమన్నారు. అలాంటి చిత్రాలు పంపిన ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సైన్యం చేతికి కొత్త రైఫిళ్లు- పాక్కు ఇక చుక్కలే!