ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఝరి పంచాయతీ పరిధిలోని శేరుగూడ ప్రాథమిక పాఠశాల పరిస్థితి వినటానికీ, చూడటానికి ఎంతో విచిత్రం. ఆ పాఠశాలలో ఉన్నది ఒక్కతే విద్యార్థి. ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఉన్న ఆ ఒక్క చిన్నారికే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ ఒకటో తరగతి చదువుతున్న ఆ ఏకైక విద్యార్థిని పేరు వైష్ణవి. ఉపాధ్యాయురాలి పేరు అనసూయ.
ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే... నిత్యం టీచరమ్మే విద్యార్థినిని స్వయంగా బడికి తీసుకొచ్చి మరీ... చదువు చెబుతోంది. ఈ గ్రామంలో దాదాపు 29 కుటుంబాలు ఉండగా... జనాభా 168 మంది ఉంటారు. వైష్ణవి తప్ప... మిగతా విద్యార్థులంతా ఉమ్రి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.
ఇవీ చూడండి:వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!